ఛత్తీస్గఢ్లో ఐఈడీలు స్వాధీనం చేసుకున్న సీఆర్పీఎఫ్ | CRPF seizes IEDs in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్లో ఐఈడీలు స్వాధీనం చేసుకున్న సీఆర్పీఎఫ్

Oct 23 2013 5:03 PM | Updated on Oct 9 2018 2:47 PM

మావోయిస్టులకు కంచుకోటగా నిలిచిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రెండు ఐఈడీలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

మావోయిస్టులకు కంచుకోటగా నిలిచిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రెండు ఐఈడీలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక్కో దాంట్లో 20 కిలోల పేలుడు పదార్థాలు నింపిన రెండు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లను ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులతో కలిసి తమ బలగాలు స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేసినట్లు సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.

150 బెటాలియన్కు చెందిన సీఆర్పీఎఫ్ బలగాలు వీటిని కొత్తగా ఏర్పాటైన సుక్మా జిల్లాలో గల చింతగుఫ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నాయి. చింతల్నార్ వైపు వెళ్లే రోడ్డు కింద వీటిని మందుపాతరలుగా రోడ్డు కింద తవ్వి పెట్టారని, దాని గురించి తమకు సమాచారం రావడంతో గాలించగా దొరికిందని సీఆర్పీఎఫ్ అధికారి చెప్పారు. వాటిని బాంబు నిర్వీర్య దళం వెంటనే ధ్వంసం చేసిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement