సాగర తీరంలో... సైట్‌ కావాలా..! | crowed beach in north poland | Sakshi
Sakshi News home page

సాగర తీరంలో... సైట్‌ కావాలా..!

Apr 2 2017 3:24 AM | Updated on Sep 5 2017 7:41 AM

సాగర తీరంలో... సైట్‌ కావాలా..!

సాగర తీరంలో... సైట్‌ కావాలా..!

మీలో ఎవరైన సమ్మర్‌ వెకేషన్‌ కోసం ఉత్తర పోలాండ్‌లోని బాల్టియా సముద్ర తీరానికి వెళ్లాలను కుంటే మాత్రం కొంచెం ముందుగానే జాగ్రత్త పడాలి.

మీలో ఎవరైన సమ్మర్‌ వెకేషన్‌ కోసం ఉత్తర పోలాండ్‌లోని బాల్టియా సముద్ర తీరానికి వెళ్లాలను కుంటే మాత్రం కొంచెం ముందుగానే జాగ్రత్త పడాలి. ఆ బీచ్‌లో కొంత స్థలాన్ని ముందుగానే రిజర్వ్‌ చేసుకోవాలి. మీస్థలాన్ని ఇతరులతో వేరు చేసేలా నిర్మించుకోవడమో లేక అక్కడ కొంత స్థలాన్ని కొనుగోలు చేయడమో చేయాలి. ఎందుకంటే ఆ బీచ్‌లో ప్రతి ఒక్కరికి కొంత ప్రదేశాన్ని కేటాయిస్తారు.

ఇది చాలా ఏళ్లుగా వస్తున్నపోలాండ్‌ సంప్రదాయమట.. కాకపోతే ఈ మధ్య కాలంలో విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువవడం, సామాజిక మాధ్యమాలు పెరిగిపోవడం, వాటిలో వీరు తమ ఫొటోలను షేర్‌ చేయడంతో ఈ సంప్రదాయం ఇంకాప్రాచుర్యంలోకి వచ్చిందని పోలాండ్‌ మీడియా చెబుతోంది. కర్రలను మట్టిలో నాటి వాటి చుట్టూ ఒక పెద్ద రంగు రంగుల గుడ్డను చుడతారు. బీచ్‌కు వచ్చే కుటుంబ సభ్యుల పరిమాణం బట్టి ఎంత స్థలం కావాలో అంతకేటాయిస్తారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement