
తండ్రి కాబోతున్న భారత క్రికెటర్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడిన టీమిండియాపై ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించకుండా జడేజా అడ్డుపడ్డాడు. ఆరు వికెట్లు సాధించి భేష్ అనిపించుకున్నాడు.
ఇక అసలు విషయానికొస్తే త్వరలోనే రవీంద్ర జడేజాకు తండ్రిగా ప్రమోషన్ లభించబోతున్నది. జడేజా భార్య రీవా సోలంకీ ప్రస్తుతం ఏడునెలల గర్భవతి. ఆమె వచ్చే మే నెలలో ప్రసవించే అవకాశముందని తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో జడేజా రీవాను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడుతున్న జడేజా తర్వలోనే భార్యను కలుసుకోబోతున్నాడు.