Reeva Solanki
-
తండ్రి కాబోతున్న భారత క్రికెటర్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడిన టీమిండియాపై ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించకుండా జడేజా అడ్డుపడ్డాడు. ఆరు వికెట్లు సాధించి భేష్ అనిపించుకున్నాడు. ఇక అసలు విషయానికొస్తే త్వరలోనే రవీంద్ర జడేజాకు తండ్రిగా ప్రమోషన్ లభించబోతున్నది. జడేజా భార్య రీవా సోలంకీ ప్రస్తుతం ఏడునెలల గర్భవతి. ఆమె వచ్చే మే నెలలో ప్రసవించే అవకాశముందని తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో జడేజా రీవాను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడుతున్న జడేజా తర్వలోనే భార్యను కలుసుకోబోతున్నాడు. -
జడేజా ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఆయన భార్య రీవా సోలంకి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శనివారం గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో జడేజా దంపతులు ప్రయాణిస్తున్న కారు ఓ మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జడేజా దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ప్రీతి శర్మ అనే విద్యార్థిని గాయపడింది. జడేజా వెంటనే ఈ అమ్మాయిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ అమ్మాయికి స్వల్ప గాయాలయ్యాయని, క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి తప్పు ఎవరన్నది తెలియరాలేదు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టి-20 సిరీస్ నుంచి జడేజాకు విశ్రాంతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. జడేజా ప్రస్తుతం స్వరాష్ట్రం గుజరాత్లో ఉన్నాడు. -
సింహాల ముందు జడేజా సాహసం
గాంధీనగర్: ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సింహాల ముందు పెద్ద సాహసమే చేశారు. కొన్ని అడుగుల దూరంలోనే వాటికి ఎదురుగా కూర్చొన ఏమాత్రం జంకు లేకుండా ఆయన భార్య రీవా సోలంకితో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. అయితే, తమ ఆనందం కోసం ఈ ఫొటో తీసుకున్నప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఈ చర్య వ్యతిరేకం కావడంతో ఈ సంఘటనపట్ల విచారణకు ఆదేశించారు. బహుశా దీనిపట్ల ఆయన వివరణ కూడా ఇవ్వల్సి ఉంటుందేమో. కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ ఆల్ రౌండర్ గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోగల సాసన్ గిర్కు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. అక్కడి గిర్ నేషనల్ పార్క్ అండ్ సాంక్చ్యూరీ(జీఎన్పీఎస్)లోని లైన్ సఫారీకి తన భార్య స్నేహితులతో కలిసి వెళ్లారు. జిప్సీలో తిరుగుతూ సింహాలను చూసి ఎంజాయ్ చేశారు. అయితే, అలా వెళుతున్న క్రమంలో మధ్య జిప్సీని ఆపి దిగడమే కాకుండా కొన్ని సింహాలకు 10 నుంచి 13 మీటర్ల దూరంలో తన భార్యతో కలిసి కూర్చొని తాఫీగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే, ఈ రకంగా ఫొటోలు దిగడం చట్ట వ్యతిరేకం. నిబంధనల ప్రకారం ఎవరూ జిప్సీ దిగకూడదు.. మధ్యలో ఆపకూడదు. పైగా సింహాలకు దగ్గరిగా వెళ్లి అలా ఫొటోలు తీయకూడదు. ఈ చర్య పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. -
క్రికెటర్ జడేజా పెళ్లిలో కాల్పులమోత..
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా వివాహం వివాదంలో చిక్కుకుంది. ఆదివారం పెళ్లి సందర్భంగా వరుడికి కొద్దిదూరంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా తీసిన బరాత్‌లో వరుడు జడేజాకు సమీపంలో ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ' కాల్పులు జరిగినట్టు కంట్రోల్ రూమ్ నుంచి మాకు సమాచారం వచ్చింది. మేం వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నాం. లైసెన్స్ కలిగిన తుపాకీతో కాల్పులు జరిపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే దీనిని వాడాల్సి ఉంటుంది. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది' అని లోధికా పోలీసు స్టేషన్ పీఎస్సై మహేంద్రసింగ్ రాణా తెలిపారు. తల్వార్ తిప్పిన వరుడు! జడేజా ఆదివారం తన ఇష్టసఖి రీవా సోలంకీని పెళ్లాడుతున్నారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పెళ్లికి తన సన్నిహిత మిత్రులైన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా డ్వేన్ బ్రావోతోపాటు పలువుకు క్రికెటర్లు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సాయంత్రం రాజ్‌కోట్‌లో రిసెప్షన్ జరుగనుంది. పెళ్లి బరాత్‌లో వరుడు జడేజా తల్వార్ తిప్పుతూ హల్చల్ చేశాడు. అతడి తల్వార్ డాన్స్ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది.