
సింహాల ముందు జడేజా సాహసం
ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సింహాల ముందు పెద్ద సాహసమే చేశారు. కొన్ని అడుగుల దూరంలోనే వాటికి ఎదురుగా కూర్చొన ఏమాత్రం జంకు లేకుండా ఆయన భార్య రీవా సోలంకితో కలిసి ఫొటోలకు పోజిచ్చారు.
గాంధీనగర్: ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సింహాల ముందు పెద్ద సాహసమే చేశారు. కొన్ని అడుగుల దూరంలోనే వాటికి ఎదురుగా కూర్చొన ఏమాత్రం జంకు లేకుండా ఆయన భార్య రీవా సోలంకితో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. అయితే, తమ ఆనందం కోసం ఈ ఫొటో తీసుకున్నప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఈ చర్య వ్యతిరేకం కావడంతో ఈ సంఘటనపట్ల విచారణకు ఆదేశించారు. బహుశా దీనిపట్ల ఆయన వివరణ కూడా ఇవ్వల్సి ఉంటుందేమో. కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ ఆల్ రౌండర్ గుజరాత్లోని జునాఘడ్ జిల్లాలోగల సాసన్ గిర్కు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు.
అక్కడి గిర్ నేషనల్ పార్క్ అండ్ సాంక్చ్యూరీ(జీఎన్పీఎస్)లోని లైన్ సఫారీకి తన భార్య స్నేహితులతో కలిసి వెళ్లారు. జిప్సీలో తిరుగుతూ సింహాలను చూసి ఎంజాయ్ చేశారు. అయితే, అలా వెళుతున్న క్రమంలో మధ్య జిప్సీని ఆపి దిగడమే కాకుండా కొన్ని సింహాలకు 10 నుంచి 13 మీటర్ల దూరంలో తన భార్యతో కలిసి కూర్చొని తాఫీగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే, ఈ రకంగా ఫొటోలు దిగడం చట్ట వ్యతిరేకం. నిబంధనల ప్రకారం ఎవరూ జిప్సీ దిగకూడదు.. మధ్యలో ఆపకూడదు. పైగా సింహాలకు దగ్గరిగా వెళ్లి అలా ఫొటోలు తీయకూడదు. ఈ చర్య పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.