
జడేజా ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఆయన భార్య రీవా సోలంకి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఆయన భార్య రీవా సోలంకి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శనివారం గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో జడేజా దంపతులు ప్రయాణిస్తున్న కారు ఓ మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జడేజా దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ప్రీతి శర్మ అనే విద్యార్థిని గాయపడింది. జడేజా వెంటనే ఈ అమ్మాయిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ అమ్మాయికి స్వల్ప గాయాలయ్యాయని, క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదానికి సంబంధించి తప్పు ఎవరన్నది తెలియరాలేదు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టి-20 సిరీస్ నుంచి జడేజాకు విశ్రాంతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. జడేజా ప్రస్తుతం స్వరాష్ట్రం గుజరాత్‌లో ఉన్నాడు.