కుక్కను కాపాడబోయి పరలోకాలకు... | couples died due to save dog in chennai | Sakshi
Sakshi News home page

కుక్కను కాపాడబోయి పరలోకాలకు...

Oct 20 2015 9:02 AM | Updated on Jul 10 2019 8:00 PM

కుక్కను కాపాడబోయి పరలోకాలకు... - Sakshi

కుక్కను కాపాడబోయి పరలోకాలకు...

ప్రాణప్రదంగా పెంచుకున్న కుక్కను కాపాడబోయిన భార్యాభర్తలు తమ ప్రాణాలను పోగొట్టుకున్న దయనీయమైన ఘటన తిరుపూరులో ఆదివారం జరిగింది.

కొరుక్కుపేట: ప్రాణప్రదంగా పెంచుకున్న కుక్కను కాపాడబోయిన భార్యాభర్తలు తమ ప్రాణాలను పోగొట్టుకున్న దయనీయమైన ఘటన తమిళనాడులోని తిరుపూరులో ఆదివారం జరిగింది. ఊత్తుకుళి వెళియంపాలయంకు చెందిన కృష్ణన్(50) క్వారీ కార్మికుడు. అతని భార్య రుక్మిణి(45) సమీపంలోని ఓ కంపెనీలో టైలర్‌గా పని చేస్తోంది. వీరి పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు నీటి ప్రవాహం వద్దకు తీసుకెళ్లారు. స్నానం చేయిస్తుండగా చేయిజారడంతో కుక్క నీటిలో మునిగిపోయింది.

దీంతో కంగారుపడిన కృష్ణన్ కుక్కను రక్షించేందుకు నీటిలో దిగాడు. అయితే అదుపుతప్పి అతను మునిగిపోతుండగా దూరం నుంచి గమనించిన రుక్మిణి భర్తను కాపాడబోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ ఊపిరాడక ప్రాణాలు విడిచారు. కుక్కతో వెళ్లిన అమ్మానాన్నలు ఎంతకూ తిరిగిరాకపోవడంతో వారి కుమారుడు దినేష్ నీటి మడుగు వద్దకు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. కుక్క మాత్రం నీటిలో ఈదుతూ కనిపించడంతో ఒడ్డుకు చేర్చాడు. ఈ విషాద ఘటన అక్కడ అందరినీ కలిచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement