బాబ్రీ మసీదు విధ్వంసానికి కాంగ్రెస్‌దే బాధ్యతని.. దాని అసమర్థత వల్లే నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు
కిషన్‌గంజ్: బాబ్రీ మసీదు విధ్వంసానికి కాంగ్రెస్‌దే బాధ్యతని.. దాని అసమర్థత వల్లే నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లా కొచ్చాదామన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సభలో మాట్లాడారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ వేగంగా స్పందించి, మోదీపై ఉక్కుపాదం మోపి చార్జిషీటు నమోదు చేసి ఉంటే.. ఆయన ప్రధాని అయ్యేవారు కాదన్నారు. అయోధ్యలో రామమందిరం తాళం తెరవటానికి, అనంతరం బాబ్రీ మసీదు విధ్వంసానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనన్నారు.