కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు | CISF Jawan killed after clash at Karipur International airport in Kerala | Sakshi
Sakshi News home page

కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు

Jun 12 2015 4:04 AM | Updated on Sep 3 2017 3:35 AM

కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు

కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు

కోజికోడ్ దగ్గర్లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది.

సీఐఎస్‌ఎఫ్ జవాను మృతి, మరొకరికి గాయాలు
కోజికోడ్(కేరళ): కోజికోడ్ దగ్గర్లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఇది కాల్పులకు దారితీయడంతో ఓ జవాను మృతిచెందాడు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణతో ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు గురువారం ఉదయం నుంచి సర్వీసులను పునరుద్ధరించారు.

ఈ పరిణామాలపై కేరళ హోంమంత్రి రమేశ్ విచారణకు ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి చెందిన అగ్నిమాపకదళ అధికారిని సోదా చేసే క్రమంలో తలె త్తిన వాదన ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీఐఎస్‌ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ జైపాల్ యాదవ్ చనిపోయినట్లు పేర్కొన్నారు. ఘటన తర్వాత సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది లాఠీలతో ప్రయాణికులను కొట్టి, విమాన సర్వీసులను అడ్డుకున్నారని సాక్షులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement