బ్యాంకు అకౌంట్ లేకపోయినా ఆధార్ ఉంటే చాలు | Can you send and receive money without a bank account? Aadhaar will make that possible | Sakshi
Sakshi News home page

బ్యాంకు అకౌంట్ లేకపోయినా ఆధార్ ఉంటే చాలు

Feb 21 2017 1:33 PM | Updated on Aug 18 2018 8:49 PM

బ్యాంకు అకౌంట్ లేకపోయినా ఆధార్ ఉంటే చాలు - Sakshi

బ్యాంకు అకౌంట్ లేకపోయినా ఆధార్ ఉంటే చాలు

బ్యాంకు అకౌంట్ లేకుండానే మనీని పంపొచ్చు, తీసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? 12 అంకెల ఆధార్ నెంబర్ తో ఇదంతా సాధ్యపడుతుందట.

న్యూఢిల్లీ : బ్యాంకు అకౌంట్ లేకుండానే మనీని పంపొచ్చు, తీసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? 12 అంకెల ఆధార్ నెంబర్ తో ఇదంతా సాధ్యపడుతుందట. మీ 12 నెంబర్ల ఈ ఆధారే ఇక సింగిల్ పాయింట్ పేమెంట్ అడ్రస్గా మారబోతోంది. త్వరలో రాబోతున్న పేమెంట్స్ బ్యాంకు ఇండియా పోస్టు ద్వారా 112 కోట్లకు పైనున్న భారతీయులు కేవలం ఆధార్ నెంబర్ తోనే నగదు తీసుకునేలా, పంపించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉందా? లేదా? అనేది అవసరం లేదు. ప్రస్తుతం ఆధార్ తనకు తాను పేమెంట్ అడ్రస్ లాగా లేదని ఇండియా పోస్టు సీఈవో ఏపీ సింగ్ తెలిపారు. కానీ 2017 సెప్టెంబర్ నుంచి ప్రారంభించబోతున్న పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్ లో మొత్తం మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు.
 
మొదట దేశవ్యాప్తంగా ఉన్న 650 జిల్లాలో కవర్ చేస్తామన్నారు. పేమెంట్ సిస్టమ్ ను మరింత సులభతరం చేసేలా ఈ ప్రక్రియను తీసుకురాబోతున్నామన్నారు. పేమెంట్స్ ను మరింత సులభతరం చేయడానికి పరిష్కారం ఆధార్ ను పేమెంట్ అడ్రస్ చేయడమేనని తాము భావించామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఎక్కడి నుంచి వచ్చే పేమెంట్లనైనా ఆధార్ రిసీవ్ చేసుకుంటుందని తెలిపారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు సింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించారు. ప్రస్తుతం 40 కోట్ల బ్యాంకు అకౌంట్లు ఆధార్ తో లింకయ్యాయి. ప్రతినెలా 2 కోట్ల ప్రజలు తమ యూనిక్ నెంబర్ ను తమ అకౌంట్లకు లింక్ చేసుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement