breaking news
IndiaPost
-
బ్యాంకు అకౌంట్ లేకపోయినా ఆధార్ ఉంటే చాలు
న్యూఢిల్లీ : బ్యాంకు అకౌంట్ లేకుండానే మనీని పంపొచ్చు, తీసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? 12 అంకెల ఆధార్ నెంబర్ తో ఇదంతా సాధ్యపడుతుందట. మీ 12 నెంబర్ల ఈ ఆధారే ఇక సింగిల్ పాయింట్ పేమెంట్ అడ్రస్‌గా మారబోతోంది. త్వరలో రాబోతున్న పేమెంట్స్ బ్యాంకు ఇండియా పోస్టు ద్వారా 112 కోట్లకు పైనున్న భారతీయులు కేవలం ఆధార్ నెంబర్ తోనే నగదు తీసుకునేలా, పంపించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉందా? లేదా? అనేది అవసరం లేదు. ప్రస్తుతం ఆధార్ తనకు తాను పేమెంట్ అడ్రస్ లాగా లేదని ఇండియా పోస్టు సీఈవో ఏపీ సింగ్ తెలిపారు. కానీ 2017 సెప్టెంబర్ నుంచి ప్రారంభించబోతున్న పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్ లో మొత్తం మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. మొదట దేశవ్యాప్తంగా ఉన్న 650 జిల్లాలో కవర్ చేస్తామన్నారు. పేమెంట్ సిస్టమ్ ను మరింత సులభతరం చేసేలా ఈ ప్రక్రియను తీసుకురాబోతున్నామన్నారు. పేమెంట్స్ ను మరింత సులభతరం చేయడానికి పరిష్కారం ఆధార్ ను పేమెంట్ అడ్రస్ చేయడమేనని తాము భావించామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఎక్కడి నుంచి వచ్చే పేమెంట్లనైనా ఆధార్ రిసీవ్ చేసుకుంటుందని తెలిపారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు సింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించారు. ప్రస్తుతం 40 కోట్ల బ్యాంకు అకౌంట్లు ఆధార్ తో లింకయ్యాయి. ప్రతినెలా 2 కోట్ల ప్రజలు తమ యూనిక్ నెంబర్ ను తమ అకౌంట్లకు లింక్ చేసుకుంటున్నారు. -
సెయింట్ థెరిసాకు మరో గౌరవం
ముంబయి: సెయింట్ హోదా పొందిన మదర్ థెరిసాకు భారత తపాళా సంస్థ తన కృతజ్ఞతను ప్రకటించింది.. వాటికన్ సిటీలో నేడు (సెప్టెంబర్ 4) భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ బహూకరించారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ అరుదైన బిరుదును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత తపాళా సంస్థ ఆమె జ్ఞాపకార్థం ఆదివారం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఈ స్టాంపును డివైన్ చైల్డ్ హైస్కూల్లో విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మిషనరీ ఆఫ్ చారిటీస్ అధికార ప్రతినిధులుగా బిషప్ ఆగ్నెలో గ్రాసియస్, సిస్టర్ రూబెల్లా హాజరయ్యారు.