యూపీఆర్టీసీకి చెందిన బస్సు లోతైన కాలువలో పడిపోవడంతో 8మంది మరణించారు.
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో 8మంది మృతిచెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
జౌన్‌పూర్ జిల్లాలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ సర్వగ్యరామ్ ఘటనా స్థలికి వెళ్లారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.