కేంద్ర మంత్రి కారు కింద బాంబు! | Bomb found near central minister Narayanasamy's home | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి కారు కింద బాంబు!

Jan 30 2014 4:13 AM | Updated on Sep 2 2017 3:09 AM

కేంద్ర మంత్రి కారు కింద బాంబు!

కేంద్ర మంత్రి కారు కింద బాంబు!

కేంద్ర మంత్రి వి.నారాయణసామి కారు కింద శక్తిమంతమైన పైపు బాంబు బయటపడింది.

యానాం, న్యూస్‌లైన్/పుదుచ్చేరి:  కేంద్ర మంత్రి వి.నారాయణసామి కారు కింద శక్తిమంతమైన పైపు బాంబు బయటపడింది. బుధవారం వేకువజామున పుదుచ్చేరి ఎలైమనన్ కోయిల్ వీధిలోని ఆయన ఇంటి బయట నిలిపి ఉంచిన కారు అడుగున ఇది కనిపించింది. దీన్ని గమనించిన కారు డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. రెండు వైపులా మూసేసి, రెండు వైర్లు తగిలించి ఉన్న గొట్టంలాంటి ఆ బాంబును తమిళనాడు పోలీసు విభాగానికి చెందిన బాంబ్‌స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. కేజీన్నర బరువున్న ఈ బాంబుకు చిన్నచిన్న ఎలక్ట్రికల్, నాన్-ఎలక్ట్రికల్  డిటోనేటర్లు అమర్చారని పోలీసులు తెలిపారు. ఇది పేలి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని అన్నారు.
 
 ఈ ఉదంతంపై పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీజీపీ కామ్‌రాజ్ చెప్పారు. ఈ సంఘటన తర్వాత మంత్రి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంత్రి నారాయణసామి మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో అసాంఘిక శక్తులు విజంభిస్తున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. బాంబు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement