'కశ్మీర్ కాదు.. కాలువలు శుభ్రం చేయండి' | Sakshi
Sakshi News home page

'కశ్మీర్ కాదు.. కాలువలు శుభ్రం చేయండి'

Published Sat, Jul 11 2015 7:42 PM

'కశ్మీర్ కాదు.. కాలువలు శుభ్రం చేయండి' - Sakshi

ముంబై: పాకిస్థాన్తో మళ్లీ చర్చల ప్రతిపాదనను నిద్వంద్వంగా తిరస్కరించిన తమ మిత్రపక్షం శివసేనకు బీజేపీ ఘాటైన సమాధానం ఇచ్చింది. పాకిస్థాన్ పట్ల శివసేన తన వైఖరి మార్చుకుంటే బాగుంటుందని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు చురకలంటించింది.

రష్యాలో మోదీ.. నవాజ్ ను కలుసుకోవడంపై శివసేన పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన దరిమిలా ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన..  'ఇండో- పాక్, కశ్మీర్ సమస్యలపై ప్రతిఒక్కరికీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే వాటిపట్ల ఇంతకు ముందున్న దృక్ఫథాన్ని మార్చుకుంటే తప్ప పరిష్కారం దొరకదు. అయినా ఇది జాతీయ ప్రధాన్యతాంశాల్లో ఒకటి. శివసేన స్థాయి సమస్యకాదు. ఒకవేళ వాళ్లు (శివసేన) ఏదైనా పరిష్కారం చేయాలనుకుంటే ముందు ముంబైలో ఇప్పుడిప్పుడే విజృంభిస్తోన్న మెదడువ్యాపు వ్యాధిని అరికట్టాలి. లేదంటే కాలువలు శుభ్రం చేసే కాంట్రాక్టర్ల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి' అని ఎద్దేవాచేశారు.

Advertisement
Advertisement