వేడుకగా భూమన కుమారుడి వివాహం | Bhumana Karunakar Reddy's son marriage ceremony | Sakshi
Sakshi News home page

వేడుకగా భూమన కుమారుడి వివాహం

Oct 30 2015 1:40 AM | Updated on Jul 25 2018 4:09 PM

వేడుకగా భూమన కుమారుడి వివాహం - Sakshi

వేడుకగా భూమన కుమారుడి వివాహం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత , తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడి వివాహం వేడుకగా జరిగింది.

ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత , తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడి వివాహం వేడుకగా జరిగింది. గురువారం రాత్రి ఫిల్మ్‌నగర్ విస్పర్ వ్యాలీలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదికైంది. భూమన కరుణాకర్‌రెడ్డి-రేవతి దంపతుల ఏకైక పుత్రుడు భూమన అభినయ్‌రెడ్డి, హైదరాబాద్ వాస్తవ్యులు బిరదాల విజయ్‌కుమార్‌రెడ్డి ప్రథమ పుత్రిక మోనిషల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

వధూవరులను వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి, షర్మిల, బ్రదర్ అనిల్‌కుమార్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, వైఎస్‌ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి ఆశీర్వదించారు. ఈ వేడుకలో సినీ నటులు బాలకృష్ణ, మోహన్‌బాబు, దాసరి నారాయణరావు, మంచు విష్ణు దంపతులు, ప్రజాగాయకుడు గద్దర్, సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ నర్సింహారెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, సజ్జల దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చిరంజీవి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కనుమూరి బాపిరాజు, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రోజా, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పలువురు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement