ప్రెగ్నెంట్‌ అయిన సింగర్‌.. | Beyonce pregnant with twins | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెంట్‌ అయిన సింగర్‌..

Feb 2 2017 2:30 PM | Updated on Sep 5 2017 2:44 AM

ప్రెగ్నెంట్‌ అయిన సింగర్‌..

ప్రెగ్నెంట్‌ అయిన సింగర్‌..

తాను త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నట్టు ప్రముఖ సింగర్‌ ప్రకటించింది

లాస్‌ ఏంజిల్స్‌: ప్రముఖ హాలీవుడ్‌ సింగర్‌, పాటల రచయిత్రి బియాన్స్‌ నోల్స్‌ తాను త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించింది. ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని తెలిపింది.  బేబీ బంప్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

‘సింగల్‌ లేడీస్‌’తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన బియాన్స్‌.. ‘మేం మా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాం. మాకు రెండువిధాల ఆశ్వీరాదాలు లభించాయి. మా కుటుంబంలోకి మరో ఇద్దరు రాబోతున్నారు. మాకు శుభాశీస్సుల అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు. భర్త అయిన ర్యాపర్‌ జెడ్‌తో బియాన్స్‌కు ఐదేళ్లు కూతురు ఉంది. 2011లో ఎంటీవీ మ్యూజిక్‌ అవార్డుల సందర్భంగా సంగీత ప్రదర్శన ఇచ్చిన తర్వాత వేదికపై తాను గర్భవతిని అయిన విషయాన్ని అప్పట్లో బియాన్స్‌ ప్రకటించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement