కర్రతో సిబ్బందిని చితకబాదిన కలెక్టర్ | Sakshi
Sakshi News home page

కర్రతో సిబ్బందిని చితకబాదిన కలెక్టర్

Published Thu, Dec 22 2016 4:21 PM

కర్రతో సిబ్బందిని చితకబాదిన కలెక్టర్

బహ్రెయిచ్‌: జిల్లా కలెక్టర్‌గా ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి తన సిబ్బందిపై దాడి చేశారు. తన ఇంట్లో రెండు చెట్లు కనిపించకపోయేసరికి అక్కడ పనిచేసే ఉద్యోగులను బాధ్యులుగా భావించి చితకబాదారు. అనంతరం వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్‌ జిల్లా కలెక్టర్‌ అభయ్‌ సింగ్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి. ఆయన దౌర్జన్యాన్ని నిరసిస్తూ బాధితులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు.

అభయ్‌సింగ్‌ అధికార నివాసంలో మంగళవారం రాత్రి రెండు చెట్లను నరికేశారు. ఈ విషయం తెలియగానే అభయ్‌ సింగ్ కోపోద్రిక్తుడయ్యారు. ఆయన ఓ కర్ర తీసుకుని అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్లాటూన్‌ కమాండర్‌ హరిశ్చంద్ర శర్మ, హోంగార్డులు దర్బరీలాల్‌, శివకుమార్‌, మహ్మద్‌ కమరుద్దీన్‌, ధర్మరాజ్‌లను చితకబాదారు. కాగా బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement