అవైవా కొత్త పథకాలు | Aviva Life launches 13 products under new IRDA guidelines | Sakshi
Sakshi News home page

అవైవా కొత్త పథకాలు

Nov 17 2013 3:09 AM | Updated on Sep 2 2017 12:40 AM

అవైవా కొత్త పథకాలు

అవైవా కొత్త పథకాలు

అవైవా లైఫ్ ‘నెక్స్‌ట్ ఇన్నింగ్స్’ పేరిట కొత్త రిటైర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చెల్లించిన ప్రీమియానికి 210 శాతం గ్యారంటీ రాబడి ఉండటం ఈ పథకంలోని ప్రత్యేకత.

అవైవా లైఫ్ ‘నెక్స్‌ట్ ఇన్నింగ్స్’ పేరిట కొత్త రిటైర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చెల్లించిన ప్రీమియానికి 210 శాతం గ్యారంటీ రాబడి ఉండటం ఈ పథకంలోని ప్రత్యేకత. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 42, గరిష్టంగా 60 ఏళ్లుగా నిర్ణయించారు. 13, 16, 18 ఏళ్ళ కాలపరిమితుల్లో లభించే ఈ పథకానికి ఒకేసారిగా లేక 5, 10 ఏళ్ళలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ప్రీమియం ఎంచుకుంటే కనీస ప్రీమియం రూ.1.5 లక్షలు, అదే పరిమితి కాలానికి ప్రీమియం ఎంచుకుంటే కనీస వార్షిక ప్రీమియం రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఐఆర్‌డీఏ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా 13 కొత్త పథకాలను అవైవా ప్రవేశపెట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement