అశోక్ లేలాండ్.. కెప్టెన్ ట్రక్‌లు | Ashok Leyland expects better sales in January | Sakshi
Sakshi News home page

అశోక్ లేలాండ్.. కెప్టెన్ ట్రక్‌లు

Jan 7 2014 12:24 AM | Updated on Sep 2 2017 2:21 AM

అశోక్ లేలాండ్.. కెప్టెన్ ట్రక్‌లు

అశోక్ లేలాండ్.. కెప్టెన్ ట్రక్‌లు

అశోక్ లేలాండ్ కంపెనీ ఈ ఏడాది 18 రకాలైన ట్రక్‌లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది.

న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ కంపెనీ ఈ ఏడాది 18 రకాలైన ట్రక్‌లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. ఈ వాణిజ్య వాహనాలను కొత్త బ్రాండ్ కెప్టెన్ కింద  అందించనున్నామని అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె. దాసరి పేర్కొన్నారు. ఈ కంపెనీ టిప్పర్ మోడల్, కెప్టెన్ 2523ను సోమవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది.

ఈ కార్యక్రమంలో కెప్టెన్ బ్రాండ్ వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా పాల్గొన్నారు. కెప్టెన్ 2523 టిప్పర్ ధర రూ. 24 లక్షలకు మించి ఉంటుందని దాసరి వివరించారు. ఇక చిన్న ట్రక్‌ల ధరలను ఈ కంపెనీ రూ.30,000 వరకూ పెంచుతోంది. కెప్టెన్ రేంజ్ వాహనాల  అభివృద్ధికి రూ.600-700 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టామని దాసరి పేర్కొన్నారు. ఈ కెప్టెన్ వాహనాలు 16-49 టన్నుల రేంజ్‌లో టిప్పర్లు, ట్రాక్టర్లు, హాలేజ్ వాహనాలుగా లభ్యమవుతాయని వివరించారు. వీటిని పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, అగ్నేయాసియా దేశాలకు ఎగుమతి చేయనున్నామన్నారు. సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో అమ్మకాలు పుంజుకుంటాయని, అదే విధంగా ఈ ఏడాది కూడా అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నామని దాసరి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement