మరో 30దేశాల్లో ఐ ఫోన్ 7 ఎంట్రీ | Apple iPhone 7 enters 30 more countries from Saturday | Sakshi
Sakshi News home page

మరో 30దేశాల్లో ఐ ఫోన్ 7 ఎంట్రీ

Sep 24 2016 12:50 PM | Updated on Aug 20 2018 2:55 PM

మరో 30దేశాల్లో ఐ ఫోన్ 7 ఎంట్రీ - Sakshi

మరో 30దేశాల్లో ఐ ఫోన్ 7 ఎంట్రీ

పండగ సీజన్ లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మొబైల్ మేకర్ ఆపిల్ సంసిద్ధమవుతోంది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సూపర్ ఐ ఫోన్ 7 ,7 ప్లస్ స్మార్ట్ ఫోన్లను మరో 30 దేశాల్లో విడుదల చేసింది.

న్యూయార్క్ :  పండగ సీజన్ లో  వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మొబైల్ మేకర్  ఆపిల్  సంసిద్ధమవుతోంది.  ఇటీవల  ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సూపర్  ఐ ఫోన్  7 ,7  ప్లస్  స్మార్ట్ ఫోన్లను మరో 30 దేశాల్లో విడుదల చేసింది.   దీపావళి షాపింగ్ కోసం శనివారం నుంచి   రష్యా, సౌదీ అరేబియా, స్లొవాకియా, స్లోవేనియా,  అన్డోరా, బహరేన్, బోస్నియాఅండ్ హెర్జెగోవినా, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, గ్రీస్, గ్రీన్ల్యాండ్, గర్న్సీ, హంగేరి, ఐస్లాండ్, జెర్సీ, కొసావో, కువైట్, లాట్వియా, లిక్తెన్స్తీన్,  లిథువేనియా, మాల్దీవులు, మాల్టా, మొనాకో, పోలాండ్, కతర్, రోమేనియా దేశాల్లో అమ్మకాలు  ప్రారంభించింది. దీంతోపాటు  వాచ్ సిరీస్ 1 కి అప్ డేటెడ్ వెర్షన్ ఆపిల్ వాచ్ సిరీస్ 2 ను మరో 20 దేశాల్లో అధికారికంగా ఈ రోజు లాంచ్ చేసింది.
కాగా  సెప్టెంబర్ 16న దాదాపు 28 దేశాల్లో లాంచ్ అయిన ఐ ఫోన్ 7, 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ల కు అనూహ్య స్పందన వస్తోంది.  ఈ నేపథ్యంలోనే దేశంలో ప్రపంచం నలుమూలల ఈ ఫోన్ ను అందుబాటులోకి  తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  ఐ ఫోన్ 7, 7 ప్లస్ లను అక్టోబర్ 7 న లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement