భూ సేకరణపై అన్నా నిరశన | Anna Hazare to go on indefinite hunger strike | Sakshi
Sakshi News home page

భూ సేకరణపై అన్నా నిరశన

Jul 16 2015 12:40 AM | Updated on Sep 3 2017 5:33 AM

భూ సేకరణపై అన్నా నిరశన

భూ సేకరణపై అన్నా నిరశన

సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగబోతున్నారు.

రాలెగావ్ సిద్ధి: సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగబోతున్నారు. వివాదాస్పద భూ సేకరణ బిల్లు, రక్షణ శాఖలో ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ (ఓఆర్‌ఓపీ) అంశాలపై ఆయన ఆందోళన చేపట్టనున్నారు. అక్టోబర్ 2న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో తాను దీక్ష చేపట్టనున్నట్లు తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ నెల 26న షహీద్ దిన్ సందర్భంగా అన్నాను అమర జవాన్ల కుటుంబ సభ్యులు సన్మానించనున్నారు.

ఆ కార్యక్రమం తర్వాత దేశ వ్యాప్తంగా రైతులు, మాజీ సైనికోద్యోగులు భూ బిల్లును నిరసిస్తూ, ఓఆర్‌ఓపీ త్వరగా అమలు చేయాలని కోరుతూ ర్యాలీలు నిర్వహిస్తారని అన్నా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement