ఫన్‌ కోసమే అలా చేశా: యాంకర్‌ రవి | anchor ravi explanation over chalapathi comments | Sakshi
Sakshi News home page

ఫన్‌ కోసమే అలా చేశా: యాంకర్‌ రవి

May 24 2017 1:03 PM | Updated on Sep 5 2017 11:54 AM

ఫన్‌ కోసమే అలా చేశా: యాంకర్‌ రవి

ఫన్‌ కోసమే అలా చేశా: యాంకర్‌ రవి

చలపతిరావు వ్యాఖ్యలను ‘సూపర్‌..’ అంటూ పొగిడిన యాంకర్‌ రవి.. తన చర్యను సమర్థించుకున్నాడు.

హైదరాబాద్‌: మహిళలను కించపరిచేలా నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను ‘సూపర్‌..’ అంటూ పొగిడిన యాంకర్‌ రవి.. తన చర్యను సమర్థించుకున్నాడు. నిర్వాహకుల సూచన మేరకు.. ఫన్‌(హాస్యం) కోసమే ‘అమ్మాయిలు హానికరం..’ డైలాగ్‌ను హైలైట్‌ చేశామని చెప్పాడు. లేడీ యాంకర్‌ ప్రశ్నకు నటుడు చలపతిరావు చెప్పిన సమాధానం అసలు వినబడనేలేదని, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో క్యాజువల్‌గా ‘సూపర్‌..’ అన్నానని వివరణ ఇచ్చాడు. బుధవారం సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రవి.. ఆద్యంతం అసహనంతో ఊగిపోతూ లైవ్‌ నుంచి నిష్కమించాడు.

అక్కినేని నాగార్జున నిర్మించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ ప్రీ రిలీజ్‌ వేడుకలో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఆయనపై పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదుకావడం తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చిన యాంకర్‌ రవి.. చలపతిరావు వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న తనను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని అన్నారు. ‘ ఒక చెవిలో మైక్రోఫోన్‌, మరోవైపు అభిమానుల కేరితల మధ్య ఆయన(చలపతి) ఏమన్నారో వినపడలేదు. వ్యక్తిగతంగా నేను ఆడవాళ్లను గౌరవిస్తా. ఎవరి శరీరాలమీదా కామెంట్లు చేయను. టీవీ ప్రోగ్రామ్స్‌లో లేడీ యాంకర్లతో కంఫర్ట్‌ పరిధిలోనే ప్రవర్తిస్తా. నా వివరణ మీకు నచ్చకుంటే నేనేమీ చెయ్యలేను..’అని యాంకర్‌ రవి అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement