భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీసాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని అమెరికా కోర్టు ఆదేశించింది.
న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీసాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని అమెరికా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోదీ అమెరికా రాకుండా విధించిన నిషేధం ఎత్తివేస్తూ బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా సమర్పించాలని పేర్కొంది. 2016, జనవరి నెల మధ్యలో ప్రాథమిక నివేదిక సమర్పించాలని న్యూయార్క్ సదరన్ డిస్టిక్ట్ జడ్జి జాన్ కొయల్ టెల్ ఈ నెల 9న ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 29కు వాయిదా వేశారు.
సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నరేంద్ర మోదీ వీసా, అమెరికాలో ఆయన ప్రవేశానికి సంబంధించిన రికార్డులు (2013 జూన్ నుంచి) ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎస్ఎఫ్‌జే కోర్టును ఆశ్రయించింది.