అల్ఖైదా స్ఫూర్తితోనే కైరో పేలుళ్లు | Al Qaeda-inspired group staged Cairo blasts | Sakshi
Sakshi News home page

అల్ఖైదా స్ఫూర్తితోనే కైరో పేలుళ్లు

Jan 25 2014 3:37 PM | Updated on Aug 17 2018 7:36 PM

అన్సర్ బైట్ అల్ మక్దిస్.. ఈ సంస్థ పేరు ఎప్పుడైనా విన్నారా? అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో సినాయ్ కేంద్రంగా ఏర్పడిన ఈ సంస్థే ఈజిప్టు రాజధాని కైరోలో పోలీసుల మీద గత శుక్రవారం నాడు బాంబుదాడులు చేసింది.

అన్సర్ బైట్ అల్ మక్దిస్.. ఈ సంస్థ పేరు ఎప్పుడైనా విన్నారా? అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో సినాయ్ కేంద్రంగా ఏర్పడిన ఈ సంస్థే ఈజిప్టు రాజధాని కైరోలో పోలీసుల మీద గత శుక్రవారం నాడు బాంబుదాడులు చేసింది. ఈ విషయాన్ని సదరు సంస్థే శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపింది. సైన్యానికి అనుకూలంగా ఎలాంటి ర్యాలీలు చేయడానికి వీల్లేదని ఈజిప్షియన్లను ఈ సంస్థ హెచ్చరించింది.

మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ను 2011లో పదవీచ్యుతుడిని చేసి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ర్యాలీలు చేస్తే ఊరుకునేది లేదంది. అన్సర్ బైట్ అల్ మక్దిస్ సంస్థ మాజీ అధ్యక్షుడు, ముస్లిం బ్రదర్హుడ్ నాయకుడు మహ్మద్ మోర్సీకి మద్దతుగా ఉంది. సైన్యం ఈయనను గత జూలైలో తొలగించింది. పోలీసు భవనాలకు ఈజిప్షియన్ ప్రజలు దూరంగా ఉండాలని కూడా ఉగ్రవాద సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement