'ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తా' | AICC can question me, Karti Chidambaram tells TNCC | Sakshi
Sakshi News home page

'ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తా'

Jan 27 2015 3:41 PM | Updated on Sep 2 2017 8:21 PM

'ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తా'

'ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తా'

పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జవాబిచ్చేందుకు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నిరాకరించారు.

చెన్నై: పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జవాబిచ్చేందుకు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నిరాకరించారు. తనను వివరణ అడిగే అధికారం ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. తాను ఏఐసీసీ సభ్యుడినని, తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఏఐసీసీకి మాత్రమే ఉందన్నారు. ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తానని చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్‌ను, పార్టీ వ్యవహారాలను విమర్శించినందుకు ఆయనకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఈనెల 23న సంజాయిషీ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసుకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఇళంగోవన్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement