సైఫ్‌-కరీనా కొడుకు పేరుతో మీకేంటి నొప్పి! | actor slams haters for trolling Kareena Kapoor | Sakshi
Sakshi News home page

సైఫ్‌-కరీనా కొడుకు పేరుతో మీకేంటి నొప్పి!

Dec 22 2016 4:06 PM | Updated on Sep 4 2017 11:22 PM

సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ దంపతులను నెటిజన్లు కొందరు తీవ్రంగా కించపరుస్తున్నారు.

  • నెటిజన్లపై మండిపడ్డ సీనియర్‌ నటుడు
  • సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ దంపతులను నెటిజన్లు కొందరు తీవ్రంగా కించపరుస్తున్నారు. ఇటీవల తమకు పుట్టిన మొదటి శిశువుకు తైమూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ అని పేరు పెట్టినట్టు సైఫ్‌, కరీనా జంట ప్రకటించడంతో.. ఆ పేరు ఎందుకు పెట్టారంటూ వింత తర్కంతో ప్రశ్నిస్తున్నారు. చరిత్ర ప్రకారం చూసుకుంటే 14వ శతాబ్దానికి చెందిన మంగోలియన్‌ దురాక్రమణదారుడు తైమూర్‌ భారత్‌పై దండేత్తి ఢిల్లీని కొల్లగొట్టాడు. ఈ దాడిలో వేలాదిమంది చనిపోయారు. అయితే, తైమూర్‌ అనే పేరుకు 'సాహసోపేతమైన రాజు', ఇనుములా దృఢమైన వాడు అనే అర్థాలు ఉన్నాయి.

    తైమూర్‌ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై అలనాటి నటుడు రిషి కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషపూరితంగా కామెంట్లు చేస్తున్నవారిని తీవ్రంగా తప్పుబట్టారు. 'తల్లిదండ్రులు తమకు నచ్చిన పేరును తమ పిల్లలకు పెట్టుకుంటారు. అభ్యంతరం చెప్పడానికి మీరు ఎవరు? మీ పనేదో మీరు చూసుకోండి. ప్రపంచవ్యాప్తంగా చాలామందికి అలెగ్జాండర్‌, సికందర్‌ వంటి పేర్లు కూడా ఉంటాయి. చరిత్రలో వారేమీ సాధువులు కారు. అంతమాత్రాన తప్పుబడతామా? తల్లిదండ్రులు తమకు నచ్చిన పేరు పిల్లలకు పెట్టుకుంటే మీకు ఏం నొప్పి' అంటూ విద్వేషపూరితంగా కామెంట్లు చేసిన పలువురు నెటిజన్లను ఆయన దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement