కోతుల గుంపులో బాలిక | 8-year-old girl found living with monkeys in forest | Sakshi
Sakshi News home page

కోతుల గుంపులో బాలిక

Apr 7 2017 1:45 AM | Updated on Sep 5 2017 8:07 AM

కోతుల గుంపులో బాలిక

కోతుల గుంపులో బాలిక

కోతుల గుంపుతో కలిసి జీవిస్తున్న ఓ 8 ఏళ్ల బాలికను ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌ జిల్లా కటార్నియా ఘాట్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో గుర్తించారు.

బహ్రయిచ్‌(యూపీ): కోతుల గుంపుతో కలిసి జీవిస్తున్న ఓ 8 ఏళ్ల బాలికను ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌ జిల్లా కటార్నియా ఘాట్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో గుర్తించారు. స్థానికుల ద్వారా బాలిక విషయం తెలుసుకున్న పోలీసులు కష్టపడి ఆమెను మర్కటాల మంద నుంచి గత జనవరిలో వేరు చేశారు. ఆమెకు ప్రస్తుతం బహ్రయిచ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలిక తన భావాలను వ్యక్తపరచలేకపోతోంది. ఎవరైనా ఆమె దగ్గరకు వెళితే గట్టిగా కేకలు వేస్తోంది.

ఈ కారణాలతో ఆమెకు సరైన చికిత్స అందించలేకపోతున్నామని వైద్యులు అంటున్నారు. ఓ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ, బాలిక గురించి తమ దగ్గర ఏ సమాచారం లేదనీ, ఆమె ప్రవర్తనను బట్టి చూస్తే చాలా కాలంపాటు అడవిలో కోతులతో జీవిస్తోందని అర్థమవుతోందని చెప్పారు. బాలికను తాము రక్షించినప్పుడు జుట్లు, గోళ్లు బాగా పెరిగి, ఆమె ఒంటినిండా గాయాలు ఉన్నాయని అధికారి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement