సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో వివిధ పోస్టుల మంజూరుకు రాష్ర్ట ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ హోదాల్లో 82 రెగ్యులర్ పోస్టులతో పాటు 22 అవుట్ సోర్సింగ్ పోస్టులు మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఉత్తర్వుల్లో తెలిపారు. జాయింట్ రిజిస్ట్రార్ (2), కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, డెరైక్టర్(పబ్లికేషన్స్), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ (3), రీజనల్ కో ఆర్డినేటర్, డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్ (అకడమిక్), డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్(అడ్మిషన్స్), డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్(ఎగ్జామ్స్), ఫైనాన్స్ ఆఫీసర్(డిప్యూటీ రిజిస్ట్రార్ కేడర్), యూనివర్సిటీ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (7), సీనియర్ సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్, పీఎస్ టు వైస్ చాన్స్‌లర్, సూపరింటెండెంట్స్ (12), డ్రాట్స్‌మెన్, సీనియర్ అసిస్టెంట్స్ (15), వీసీకి పీఏ (సీనియర్ స్టెనోగ్రాఫర్), జాయింట్ రిజిస్ట్రార్ పీఏ (సీనియర్ స్టెనోగ్రాఫర్), జూనియర్ అసిస్టెంట్స్ (15), లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ (2), స్టాటిస్టికల్ ఆఫీసర్, డెరైక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రోగ్రామర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ (4), ట్రేసర్స్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులున్నట్లు పేర్కొన్నారు.
వీటితో పాటు అవుట్ సోర్సింగ్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ సబార్డినేట్(18), ఎలక్ట్రీషియన్ కమ్ జనరేటర్ ఆపరేటర్, ప్లంబర్ పోస్టులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో 147 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ పంపించిన ప్రతిపాదనలకు పరిశీలించి కొత్త పోస్టులకు ఆమోదం తెలుపుతూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పిడియాట్రిక్ ఐసీయూ, నియోనాటల్ ఐసీయూ, మెట ర్నల్ ఐసీయూ, అనస్థీషియా యూనిట్లో వివిధ పోస్టులతో పాటు ఇతర పారామెడికల్ పోస్టులను మంజూరు చేసింది.
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి 462 పోస్టులు
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి 462 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కాలేజీ సూపరింటెండెంట్ కార్యాలయానికి 55, ప్రిన్సిపల్ ఆఫీసుకు 24, క్లినికల్ స్పెషాలిటీ విభాగానికి 302, నాన్ క్లినికల్ స్పెషాలిటీ విభాగానికి 81 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది.
అటవీ శాఖలో 42 పోస్టులు..
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు అటవీ శాఖలో 42 సూపర్ న్యూమరీ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. వీటికి అమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 18 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, 4 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 9 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, 2 సీనియర్ అసిస్టెంట్, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సృష్టించారు.
755 కొత్త పోస్టుల మంజూరు
Published Wed, Jan 20 2016 5:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement