
పాకిస్థాన్ సైన్యానికి భారీ నష్టం
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాలు దువ్వుతున్న పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాలు దువ్వుతున్న పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్ము కశ్మీర్లో కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో బీఎస్ఎప్ జవాన్లు పాకిస్థాన్కు చెందిన ఏడుగురు రేంజర్లను హతమార్చారు.
శుక్రవారం సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు భారత స్థావరాలపై కాల్పులు జరిపారు. ఇందుకు ప్రతిచర్యగా బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు పాక్ రేంజర్లు మరణించినట్టు బీఎస్ఎఫ్ అధికారులు ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత.. పాక్ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఇదే తొలిసారి.