బస్సు లోయలో పడి 50 మంది సజీవదహనం | 50 burnt to death in madhya pradesh bus accident | Sakshi
Sakshi News home page

బస్సు లోయలో పడి 50 మంది సజీవదహనం

May 4 2015 5:51 PM | Updated on Oct 8 2018 3:17 PM

బస్సు లోయలో పడి 50 మంది సజీవదహనం - Sakshi

బస్సు లోయలో పడి 50 మంది సజీవదహనం

మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో బస్సు అదుపుతప్పి కల్వర్టు మీద నుంచి పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో 35 మంది సజీవ దహనమయ్యారు.

మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో బస్సు అదుపుతప్పి కల్వర్టు మీద నుంచి పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో 50 మంది సజీవ దహనమయ్యారు. డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం రాష్ట్ర రాజధాని భోపాల్కు 550 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పన్నా నుంచి ఛత్తర్పూర్ వెళ్తున్న ఆ బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నారు. అయితే సరిగ్గా ఎంత మంది మరణించారన్న వివరాలను మాత్రం అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు.

ఈ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement