రోడ్డుపై దిగిన విమానం | 4 seater plane lands on highway | Sakshi
Sakshi News home page

రోడ్డుపై దిగిన విమానం

Jan 1 2014 12:46 AM | Updated on Sep 2 2017 2:09 AM

రోడ్డుపై దిగిన విమానం

రోడ్డుపై దిగిన విమానం

గాలిలో ఎగరాల్సిన విమానం అకస్మాత్తుగా నడిరోడ్డుపై దిగింది.

బెతుల్: గాలిలో ఎగరాల్సిన విమానం అకస్మాత్తుగా నడిరోడ్డుపై దిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌లో మంగళవారం ఉదయం జరిగింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపేశారు. శామ్ వర్మ అనే ఎన్నారైకి చెందిన చిన్నపాటి విమానం గాలిలో ఎగురుతుండగా బలమైన గాలులు వీచాయి. వాతావరణం సరిగాలేకపోవడంతో పైలట్ నాలుగు లేన్ల రహదారిపై అత్యవసరంగా దింపేశారు. అందులో ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలే దు. విమానం సురక్షితంగా దిగేందుకు పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపేయడంతో పెద్ద ముప్పు తప్పింది. పైలట్ ముందుగా సప్నా డ్యామ్ వద్ద దిగేం దుకు అనుమతికోరగా భద్రతా కారణాలరీత్యా అనుమతించలేదు. ఈ ఘట నపై డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ చేపట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement