గ్వాటెమలలో బస్సు ప్రమాదం: 35 మంది మృతి | 35 killed in Guatemala bus crash | Sakshi
Sakshi News home page

గ్వాటెమలలో బస్సు ప్రమాదం: 35 మంది మృతి

Sep 10 2013 9:31 AM | Updated on Sep 1 2017 10:36 PM

గ్వాటెమల నగర సమీపంలోని అత్యంత ఎతైన ప్రదేశంలో ప్రయాణిస్తున్న బస్సు ఆదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 35 మంది ప్రయాణికులు మరణించారు.

గ్వాటెమల నగర సమీపంలోని అత్యంత ఎత్తేన ప్రదేశంలో ప్రయాణిస్తున్న బస్సు ఆదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 35 మంది ప్రయాణికులు మరణించారని ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. ఆ ప్రమాదం నిన్న చోటు చేసుకన్న సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

 

మరో 50 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.వారు గ్వాటెమల నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. బస్సు బ్రేకులు  సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఆ దుర్ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement