ఆంధ్రప్రదేశ్ లో 24 గంటలు విద్యుత్ సరఫరా: సుజనా చౌదరి | 24 hours power supply with in six months, says Sujana Chowdary | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ లో 24 గంటలు విద్యుత్ సరఫరా: సుజనా చౌదరి

Jun 26 2014 12:12 PM | Updated on Sep 18 2018 8:38 PM

ఆంధ్రప్రదేశ్ లో 24 గంటలు విద్యుత్ సరఫరా: సుజనా చౌదరి - Sakshi

ఆంధ్రప్రదేశ్ లో 24 గంటలు విద్యుత్ సరఫరా: సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్ కు 500 మెగావాట్ల విద్యుత్ ను ఇచ్చేందుకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంసిద్ధత వ్యక్తం చేశారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్కు 500 మెగావాట్ల విద్యుత్ను ఇచ్చేందుకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంసిద్ధత వ్యక్తం చేశారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి గోయల్తో సుదీర్ఘ భేటీ అనంతరం సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడారు.

 

ఎంపీటీసీ లైన్ల ద్వారా ఈ విద్యుత్ సర్దుబాటు చేస్తారని ఆయన వివరించారు. దాంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 24 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందుతుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు. సౌర, పవన విద్యుత్పై కూడా ఆ సమావేశంలో కేంద్ర మంత్రి, చంద్రబాబుల మధ్య చర్చ జరిగినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో బొగ్గు సరఫరాపై కూడా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని సుజనా చౌదరి వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement