21 కంపెనీలకు షాకిచ్చిన బీఎస్సీ | 21 companies face BSE trading suspension from 18 October | Sakshi
Sakshi News home page

21 కంపెనీలకు షాకిచ్చిన బీఎస్సీ

Sep 28 2016 3:04 PM | Updated on Sep 4 2017 3:24 PM

21 కంపెనీలకు షాకిచ్చిన బీఎస్సీ

21 కంపెనీలకు షాకిచ్చిన బీఎస్సీ

లిస్టింగ్ నిబంధనలను పాటించని 21 కంపెనీలపై సస్పెన్షన్ విధించాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)నిర్ణయించింది. రెగ్యులేషన్ యాక్ట్ 55ఏ కింద ఈ కంపెనీల సెక్యూరిటీల ట్రేడింగ్ అక్టోబర్ 18 నుంచి తాత్కాలికంగా నిలిపివేయబడుతుండని బీఎస్ఈ నోటీసులు జారీ చేసింది.

ముంబై:  లిస్టింగ్ నిబంధనలను పాటించని  21 కంపెనీలపై సస్పెన్షన్ విధించాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)నిర్ణయించింది. రెగ్యులేషన్ యాక్ట్  55ఏ  కింద ఈ  కంపెనీల సెక్యూరిటీల ట్రేడింగ్ అక్టోబర్ 18 నుంచి  తాత్కాలికంగా నిలిపివేయబడుతుండని బీఎస్ఈ  నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ అయిన 21 రోజుల తర్వాత సస్పెన్షన్ అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే అక్టోబర్ 10 వరకూ ఈ కంపెనీలకు గడువు విధించింది. ఈ లోపు సదరు కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తే.. ట్రేడింగ్ సస్పెన్షన్‌ను నిలిపివేస్తారు. నింబంధనలకు లోబడి సస్పెన్షన్ రద్దు విధానం ఆధారపడి ఉంటుందని  బీఎస్సీ జారీ  చేసిన సర్య్కులర్ లోతెలిపింది. తదుపరి ప్రకటన వరకు ఈ కంపెనీల మొత్తం ప్రమోటర్ వాటా స్తంభింపచేయాలని ఆదేశించింది. ఫైన్ చెల్లించేంతవరకు  నిబంధనలకు లోబడి ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అలాగే  15 రోజుల సస్పెన్షన్ తర్వాత అనుకూల కంపెనీల షేర్లలో  'జెడ్ గ్రూపు'  ప్రాతిపదికన ప్రతి వారం ట్రేడింగ్ మొదటి రోజున ఆరు నెలల పాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్  అనుమతి ఉంటుందని బీఎస్ఈ తెలిపింది.
తాత్కాలిక నిషేధానికి గురైన కంపెనీల్లో ఆర్యా గ్లోబల్, భాగ్యోదయా ఇన్ఫ్రా, ఎంటిగ్రా, ఆక్రోపెటల్ టెక్నాలజీస్, బ్రాడ్‌కాస్ట్ ఇనీషియేటివ్స్, ఫ్యాక్టర్ స్టీల్స్, పారామౌంట్ ప్రింట్ ప్యాకేజింగ్, ఎఫ్ఈ ఇండియా, తిరుపతి ఇంక్స్, సినర్జీ సిస్టమ్స్ ఉన్నాయి.  వీటితో పాటు జిఈఐ ఇండస్ట్రియల్ సిస్టమ్స్, కేడీజే హాలిడేస్, కైరా ల్యాండ్ స్కేప్స్, లోక్ హౌసింగ్, లుమాక్స్ ఆటోమోటివ్, మాగ్నా ఇండస్ట్రీస్, రాజధాని లీజింగ్, రత్నమణి ఆగ్రో, ఆర్ఎన్‌బి ఇండస్ట్రీస్, శ్రీ యాష్టర్ టెక్నాలజీస్, సూర్యజోతి స్నిన్నింగ్ మిల్స్ ఉన్నాయి.
కాగా సెబి రెగ్యులేషన్ 55ఏ కింద, లిస్టెడ్ కంపెనీలు తమ  త్రైమాసిక 'వాటా మూలధనం ఆడిట్ నివేదిక ' సమర్పించాల్సి ఉంటుంది. త్రైమాసికం ముగిసి 30 రోజుల్లోగా  అందజేయాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement