breaking news
trading suspension
-
లాంకో ఇన్ఫ్రా ట్రేడింగ్ నిలిపివేత : ధర ఎంత?
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయి, మూసివేత బాటపట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్ఫ్రాకు మరోభారీ షాక్ తగిలింది. త్వరలోనే కంపెనీ మూత పడనున్న నేపథ్యంలో స్టాక్ ఎక్సేంజ్ బీఎస్ఈ గురువారం లాంకో ఇన్ఫ్రాటెక్ ఈక్విటీ షేర్లలో ట్రేడింగ్ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 14,2018 నుంచి సస్పెండ్ చేయనున్నట్లు ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. లిక్విడేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో భవిష్యత్‌లో మార్కెట్ సమస్యలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్టుతెలిపింది. దీంతో లాంకో షేరు 4శాతం క్షీణించి 48 పైసల వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది. దివాలా ప్రక్రియ స్మృతి (ఐబీసీ) ప్రకారం ఆర్బీఐ గుర్తించిన 12 కంపెనీల్లో లాంకో కూడా ఒకటి. లాంకోకు భారీగా రుణాలిచ్చిన ప్రధాన బ్యాంకు ఐడీబీఐ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. ఐబిబిఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని వాదించింది. దీన్ని విచారించిన ఎన్సీఎల్టీ ఇటీవల లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చింది. పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితిలో ఉన్న ల్యాంకో ఇన్ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆగస్టు 27న అనుమతినిచ్చింది. ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ఉన్న సావన్ గొడియావాలాను ల్యాంకో ఇన్ఫ్రా లిక్విడేటర్‌గా నియమించింది -
21 కంపెనీలకు షాకిచ్చిన బీఎస్సీ
ముంబై: లిస్టింగ్ నిబంధనలను పాటించని 21 కంపెనీలపై సస్పెన్షన్ విధించాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)నిర్ణయించింది. రెగ్యులేషన్ యాక్ట్ 55ఏ కింద ఈ కంపెనీల సెక్యూరిటీల ట్రేడింగ్ అక్టోబర్ 18 నుంచి తాత్కాలికంగా నిలిపివేయబడుతుండని బీఎస్ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ అయిన 21 రోజుల తర్వాత సస్పెన్షన్ అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే అక్టోబర్ 10 వరకూ ఈ కంపెనీలకు గడువు విధించింది. ఈ లోపు సదరు కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తే.. ట్రేడింగ్ సస్పెన్షన్‌ను నిలిపివేస్తారు. నింబంధనలకు లోబడి సస్పెన్షన్ రద్దు విధానం ఆధారపడి ఉంటుందని బీఎస్సీ జారీ చేసిన సర్య్కులర్ లోతెలిపింది. తదుపరి ప్రకటన వరకు ఈ కంపెనీల మొత్తం ప్రమోటర్ వాటా స్తంభింపచేయాలని ఆదేశించింది. ఫైన్ చెల్లించేంతవరకు నిబంధనలకు లోబడి ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అలాగే 15 రోజుల సస్పెన్షన్ తర్వాత అనుకూల కంపెనీల షేర్లలో 'జెడ్ గ్రూపు' ప్రాతిపదికన ప్రతి వారం ట్రేడింగ్ మొదటి రోజున ఆరు నెలల పాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్ అనుమతి ఉంటుందని బీఎస్ఈ తెలిపింది. తాత్కాలిక నిషేధానికి గురైన కంపెనీల్లో ఆర్యా గ్లోబల్, భాగ్యోదయా ఇన్ఫ్రా, ఎంటిగ్రా, ఆక్రోపెటల్ టెక్నాలజీస్, బ్రాడ్కాస్ట్ ఇనీషియేటివ్స్, ఫ్యాక్టర్ స్టీల్స్, పారామౌంట్ ప్రింట్ ప్యాకేజింగ్, ఎఫ్ఈ ఇండియా, తిరుపతి ఇంక్స్, సినర్జీ సిస్టమ్స్ ఉన్నాయి. వీటితో పాటు జిఈఐ ఇండస్ట్రియల్ సిస్టమ్స్, కేడీజే హాలిడేస్, కైరా ల్యాండ్ స్కేప్స్, లోక్ హౌసింగ్, లుమాక్స్ ఆటోమోటివ్, మాగ్నా ఇండస్ట్రీస్, రాజధాని లీజింగ్, రత్నమణి ఆగ్రో, ఆర్ఎన్బి ఇండస్ట్రీస్, శ్రీ యాష్టర్ టెక్నాలజీస్, సూర్యజోతి స్నిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. కాగా సెబి రెగ్యులేషన్ 55ఏ కింద, లిస్టెడ్ కంపెనీలు తమ త్రైమాసిక 'వాటా మూలధనం ఆడిట్ నివేదిక ' సమర్పించాల్సి ఉంటుంది. త్రైమాసికం ముగిసి 30 రోజుల్లోగా అందజేయాలి.