లాంకో ఇన్‌ఫ్రా ట్రేడింగ్‌ నిలిపివేత : షేరు ధర ఎంత?

BSE to suspend trading in Lanco Infratech from Sept 14 - Sakshi

సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయి, మూసివేత బాటపట్టిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాకు మరోభారీ షాక్‌ తగిలింది.  త్వరలోనే కంపెనీ మూత పడనున్న నేపథ్యంలో స్టాక్ ఎక్సేంజ్ బీఎస్‌ఈ గురువారం లాంకో ఇన్ఫ్రాటెక్ ఈక్విటీ షేర్లలో ట్రేడింగ్‌ సస్పెండ్‌ చేస్తున్నట్టు  ప్రకటించింది. సెప్టెంబర్ 14,2018 నుంచి సస్పెండ్ చేయనున్నట్లు ఒక  సర్క్యులర్‌లో పేర్కొంది. లిక్విడేషన్‌ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో భవిష్యత్‌లో  మార్కెట్‌ సమస‍్యలను నివారించేందుకు ఈ చర‍్య తీసుకున్నట్టుతెలిపింది. దీంతో లాంకో షేరు 4శాతం క్షీణించి 48 పైసల వద్ద  ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది.

దివాలా ప్రక్రియ స్మృతి (ఐబీసీ) ప్రకారం ​​ఆర్‌బీఐ  గుర్తించిన 12 కంపెనీల్లో లాంకో కూడా ఒకటి.  లాంకోకు భారీగా రుణాలిచ్చిన ప్రధాన బ్యాంకు ఐడీబీఐ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ  హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేసింది.  ఐబిబిఐ బ్యాంక్ నేతృత్వంలోని  బ్యాంకుల కన్సార్టియానికి  మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని వాదించింది. దీన్ని విచారించిన ఎన్‌సీఎల్‌టీ ఇటీవల  లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చింది. పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితిలో ఉన్న  ల్యాంకో ఇన్‌ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్‌) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆగస్టు 27న అనుమతినిచ్చింది. ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్‌పీ) ఉన్న సావన్‌ గొడియావాలాను ల్యాంకో ఇన్‌ఫ్రా లిక్విడేటర్‌గా నియమించింది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top