'ఢిల్లీలో ప్రతిరోజు 14 మంది పిల్లలు మాయం' | 14 children go missing in Delhi everyday: Child Relief and You (CRY) | Sakshi
Sakshi News home page

'ఢిల్లీలో సగటున ప్రతిరోజు 14 మంది పిల్లలు మాయం'

Sep 16 2013 5:59 PM | Updated on Sep 1 2017 10:46 PM

దేశ రాజధాని ఢిల్లీలో సగటున ఒకరోజులో 14 మంది పిల్లలు మాయమవుతున్నట్టు చైల్డ్ రిలీఫ్ అండ్ యూ (సీఆర్ వై) వెల్లడించింది.

దేశ రాజధాని ఢిల్లీలో సగటున ఒకరోజులో 14 మంది పిల్లలు మాయమవుతున్నట్టు చైల్డ్ రిలీఫ్ అండ్ యూ (సీఆర్ వై) వెల్లడించింది. 2012 సంవత్సరంలో 4086, 2011లో 5004, 2011 లో 2161 మంది పిల్లలు కనిపించకుండా పోయినట్టు తెలిపారు. పిల్లలు తప్పి పోయినట్టు కేసు నమోదు చేసినా పోలీసు అధికారులు సరిగా స్పందించడలేదని.. ఎప్పుడైనా..ఎవరైనా పిల్లలు తప్పిపోయనట్టు సమాచారం అందిస్తే.. తగు చర్యలు తీసుకోవాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్ సీపీసీఆర్) సభ్యురాలు నైనా నాయక్ సూచించారు.

పిల్లలను వెతకడానికి కుటుంబ సభ్యులు అందించిన సమాచారాని కేసు దర్యాప్తుకు వినియోగించుకోవాలని నైనా తెలిపారు. తప్పిపోయినట్టు ఇచ్చిన సమాచారంపై వివిధ శాఖల్లో వివిధ రకాలుగా గణాంకాలు ఉన్నాయని.. జోనల్ ఇంటిగ్రేటెడ్ పోలీస్ నెట్ వర్క్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) మధ్య సరియైన అవగాహన లేదని.. ఆమె తెలిపారు. పిల్లల సంరక్షణపై అధికారుల వద్ద సరియైన ప్రణాళిక లేదని అన్నారు. గతంలో పిల్లలు తప్పిపోయారని పలువురు తల్లితండ్రులు ఫిర్యాదు చేసినా.. పోలీసు అధికారులు స్పందించకపోగా, లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని నైనా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement