ఒకే కుటుంబంలో 13 మందికి జీవితఖైదు | 13 family members get life sentence for farmer's murder | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో 13 మందికి జీవితఖైదు

Jul 25 2014 3:43 PM | Updated on Oct 1 2018 4:45 PM

భూవివాదం నేపథ్యంలో తమ గ్రామంలోని ఓ గిరిజన రైతును చంపినందుకు ఓ కుటుంబంలో ఉన్న 13 మందికి జీవితఖైదు విధించారు.

భూవివాదం నేపథ్యంలో తమ గ్రామంలోని ఓ గిరిజన రైతును చంపినందుకు ఓ కుటుంబంలో ఉన్న 13 మందికి జీవితఖైదు విధించారు. అందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. రతీరాం రౌత్, సాధురాం, ఆశ్రమ్, సుభాష్, మహేష్ రాం, అభిరాం, రాంనివాస్, అనిల్, వినోద్, పుష్ప, గులాపి, సుఖి, బసంత్ బాయ్ అనే వీళ్లంతా ఈ నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో జిల్లా, సెషన్స్ జడ్జి అనిల్ కుమార్ శుక్లా వీరందరికీ జీవిత ఖైదు విధించారు.

2013 నవంబర్ 13వ తేదీన రౌత్ కుటుంబ సభ్యులు అశోక్ కిస్పొట్టా అనే రైతుపైన, అతడి కుటుంబంపైన కర్రలతో దాడి చేశారు. ఈ రెండు కుటుంబాలకు మధ్య ఎప్పటినుంచో భూవివాదం ఉంది. అశోక్ను బాగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మరో నలుగురు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. అనంతరం హతుడి భార్య సుష్మ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement