10 ఏళ్లకే హైస్కూల్ విద్య పూర్తి!


లాస్ ఏంజెలిస్: అమెరికాలో భారత సంతతికి చెందిన బాలమేధావి తనిష్క్ అబ్రహాం పదేళ్లకే అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలో అతిపిన్న వయసులో హైస్కూలు విద్యను పూర్తిచేసిన విద్యార్థుల్లో ఒకడిగా రికార్డు సష్టించాడు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకు చెందిన అబ్రహాం ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో హైస్కూలు డిప్లొమాను అందుకున్నాడు. ఏడేళ్ల వయసు నుంచీ ఇంటిదగ్గరే చదువుకుంటూ అతడు ఈ ఘనతను సాధించడం విశేషం. త్వరలో కమ్యూనిటీ కాలేజీలో చివరి సెమిష్టర్‌నూ పూర్తిచేయనున్న అబ్రహాం అసోసియేట్ డిగ్రీని పొందనున్నాడు.


 


తర్వాత యూనివర్సిటీలో చదువుకోనున్నాడు. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా లేదా వైద్యుడిగా పేరుతెచ్చుకోవాలని, అలాగే అమెరికా అధ్యక్షుడు కూడా కావాలనుందని ఈ బుడతడు చెబుతున్నాడు.


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top