మరో 10మందిపై నిషేధం: ఎన్‌ఎస్‌ఈఎల్ | 10 more defaulters barred from stock trading | Sakshi
Sakshi News home page

మరో 10మందిపై నిషేధం: ఎన్‌ఎస్‌ఈఎల్

Aug 30 2013 2:35 AM | Updated on Sep 1 2017 10:14 PM

చెల్లింపుల సంక్షోభానికి సంబంధించి మరో 10 మందిపై నిషేధాన్ని విధిస్తున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) తెలిపింది.

ముంబై: చెల్లింపుల సంక్షోభానికి సంబంధించి మరో 10 మందిపై నిషేధాన్ని విధిస్తున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీఎస్‌ఈ, ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌లతో సంప్రదింపుల తరువాత 10 మంది డిఫాల్టర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల ట్రేడింగ్ కార్యకలాపాల నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొంది. వీటిలో లోయిల్ కాంటినెంటల్ ఫుడ్, లోయిల్ హెల్త్ ఫుడ్స్, మోహన్ ఇండియా, నామ్‌ధారీ ఫుడ్ ఇంటర్నేషనల్, నామధారీ రైస్ అండ్ జనరల్ మిల్స్, వైట్ వాటర్ ఫుడ్స్, శ్రీ రాధే ట్రేడింగ్, పీడీ ఆగ్రోప్రాసెసర్స్,
 
 స్వస్తిక్ ఓవర్‌సీస్ కార్పొరేషన్, జుగర్‌నాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపులను చేపట్టడంలో ఎన్‌ఎస్‌ఈఎల్ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంలో భాగమైన సభ్యులలో ఎన్‌కే ప్రొటీన్స్ సంస్థ అత్యధికంగా రూ. 970 కోట్లను చెల్లించలేకపోయిందని ఎన్‌ఎస్‌ఈఎల్ పేర్కొంది. ఈ బాటలో శ్రీ రాధే ట్రేడింగ్ రూ. 34.64 కోట్లు, పీడీ ఆగ్రోప్రాసెసర్స్ రూ. 637.55 కోట్లు, స్వస్తిక్ ఓవర్‌సీస్ రూ. 101 కోట్లు, ఏఆర్‌కే ఇంపోర్ట్స్ రూ. 719.4 కోట్లు, లోటస్ రిఫైనరీస్ రూ. 252.56 కోట్లు చొప్పున బాకీ పడినట్లు వెల్లడించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement