రేపటి నుంచి వైఎస్ఆర్ సీపీ తెలంగాణ జిల్లాల సమీక్ష | ysrcp telangana review meeting tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వైఎస్ఆర్ సీపీ తెలంగాణ జిల్లాల సమీక్ష

Oct 15 2014 11:21 AM | Updated on Sep 6 2018 3:01 PM

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టి పెట్టింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో  పార్టీ బలోపేతంపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టి పెట్టింది. వైఎస్ఆర్ సీపీ తెలంగాణ విభాగం గురువారం నుంచి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది.  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణలోని పది జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. రేపు మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement