వైఎస్ పథకాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం | ysr congress party joined Mangya, kesya hordes residents | Sakshi
Sakshi News home page

వైఎస్ పథకాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం

Mar 16 2014 4:09 AM | Updated on Mar 19 2019 5:47 PM

వైఎస్ పథకాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం - Sakshi

వైఎస్ పథకాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

 తొర్రూరు టౌన్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.  తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామ శివారు మంగ్యా, కేష్య తండా వాసులు శనివారం ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ ఆశయసాధన వైఎస్సార్ సీపీతోనే సాధ్యమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పథకంలో తొలగించిన 133 వ్యాధులను తిరిగి జాబితాలో చేరుస్తామన్నారు.

 

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంతోపాటు రైతుల అభ్యున్నతికి రూ.మూడు వేల కోట్లు కేటారుుస్తామన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో జాటోతు ధర్మానాయక్, జాటోతు భద్రునాయక్, లింగ్యానాయక్, వాల్యనాయక్, యాకుబ్‌నాయక్, రాందాస్, టకూర్‌నాయక్,  దౌడానాయక్, బుండానాయక్, దేవానాయక్, సోమ్లానాయక్ ఉన్నారు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

 

కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కందాడి అచ్చిరెడ్డి, ల్యాండ్ అసైన్‌మెంట్ సభ్యులు కొటగిరి సదర్శన్‌గౌడ్,  యూత్ మండల అధ్యక్షుడు దికొండ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు జూకంటి వెంకన్న, మధూసూదన్‌రెడ్డి, రాంచంద్రయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement