8 నుంచి షర్మిల ‘తెలంగాణ’యాత్ర | ys sharmila paramarsa yatra from december 8 | Sakshi
Sakshi News home page

8 నుంచి షర్మిల ‘తెలంగాణ’యాత్ర

Dec 1 2014 12:36 AM | Updated on Aug 21 2018 5:36 PM

యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు - Sakshi

యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు

దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శించనున్నారు.

* తెలంగాణ రాష్ట్ర వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
* కల్వకుర్తిలో ప్రారంభమయ్యే పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శించనున్నారు. డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఈ పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పర్యటించాక జడ్చర్ల-షాద్‌నగర్‌లో యాత్ర ముగియనుంది. ఈ మేరకు ఆది వారం లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయం లో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి... పరామర్శ యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాష్, హెచ్‌ఏ రెహ్మాన్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 18 మంది కుటుంబాలను షర్మిల  పరామర్శిస్తారని చెప్పారు.

గతంలో జగన్ ఖమ్మంలో ఓదార్పు యాత్రను పూర్తి చేశారని, కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడిందన్నారు. ఇప్పుడు జగన్ సోదరి షర్మిల యాత్రను కొనసాగిస్తారన్నారు. వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయపద్రం చేయాలన్నారు. ఇది ఎన్నికలు, రాజకీయం కోసమో చేసే యాత్ర కాదని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర నేతలు మామిడి  శ్యాంసుం దర్‌రెడ్డి, బి.రవీందర్ రెడ్డి, శేఖర్ పంతులు, పి.నాగిరెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి, భీంరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement