ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపెల్లి గ్రామానికి చెందిన గంధం నరేశ్ (20) అనే యువకుడు సోమవారం ఉదయం పాముకాటుతో మృతిచెందాడు.
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపెల్లి గ్రామానికి చెందిన గంధం నరేశ్ (20) అనే యువకుడు సోమవారం ఉదయం పాముకాటుతో మృతిచెందాడు. మొక్కజొన్న చేనుకు కాపలాగా వెళ్లిన నరేశ్ అక్కడ మంచంపై పడుకుని ఉండగా పాము కాటు వేసింది. సోమవారం ఉదయం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చేనుకు వెళ్లి చూడగా.. మంచంపై పడి ఉన్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పాముకాటు మందు అందుబాటులో లేకపోవడంతో నరేశ్ మృతిచెందాడు.