డెంగీతో యువతి మృతి

Young Woman Died With Dengue Fever in Hyderabad - Sakshi

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పతి ఎదుట బంధువుల ఆందోళన

హఫీజ్‌పేట్‌ : డెంగీతో ఓ యువతి మృతి చెందిన సంఘటన మదీనాగూడలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వికారాబాద్‌ జిల్లా,  నారాయణపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి బీహెచ్‌ఈఎల్‌ బస్‌డిపోలో డ్రైవర్‌గా పని చేస్తూ రామచంద్రాపురం గ్రామంలో ఉంటున్నాడు. అతడి కుమార్తె శైలజ (21)కు శుక్రవారం రాత్రి జ్వరంతో రావడంతో స్థానిక వైద్యులను సంప్రదించగా డెంగీ సోకినట్లు నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం మదీనాగూడలోని శ్రీకర ఆస్పతికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. 

ఆస్పత్రి ఎదుట ఆందోళన....
డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శైలజ మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పతి ముందు ఎదుట ఆందోళన చేపట్టారు. శనివారం రాత్రి డాక్టర్లు అందుబాటులో లేక నర్సులే ఆమెకు చికిత్స చేశారని, సరైన వైద్యం అందనందునే ఆమె మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు. మియాపూర్‌ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమింపజేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top