యువకుడి దారుణ హత్య  | Young Man Murder In Mahabubnagar | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య 

May 31 2018 2:02 PM | Updated on Oct 8 2018 5:07 PM

Young Man Murder In Mahabubnagar - Sakshi

దర్యాప్తు చేస్తున్న పోలీసులు, రాము (ఫైల్‌) 

కోస్గి (కొడంగల్‌) : జీవనోపాధి కోసం ఓ ఎన్‌జీఓలో పని చేస్తున్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండకు చెందిన ఓ యువకుడు బుధవార ం పట్టణ శివారులో దారుణ హత్యకు గురయ్యా డు. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన రాము(35) వాసన్‌ స్వచ్ఛంద సంస్థలో గత నాలుగేళ్లుగా కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్‌ మండలాలకు సంబంధించిన రైతు సంఘాలకు కోఆర్గినేటర్‌గా పనిచేస్తున్నాడు. కోస్గిలో భార్యాపిల్లలతో అద్దెకు నివాసం ఉంటూ విధులు నిర్వహించేవాడు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం పాతర్లగడ్డ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ కృష్ణయ్య ప్రాథమిక పంచనామా నిర్వహించారు. అక్కడ లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా రాముగా గుర్తించారు. అనంతరం పేట సీఐ రామకృష్ణ క్లూస్‌టీంతో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రస్తుతానికి రాముతోపాటు సంస్థలో పనిచేస్తున్న రాఘవేందర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా పట్టపగలు ఓ యువకుడు దారుణ హత్యకు గురి కావడంతో పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది. 

Advertisement
 
Advertisement
Advertisement