‘యోగా చేస్తే మతం నుంచి బహిష్కరించారు’ | yoga Religious boycott | Sakshi
Sakshi News home page

‘యోగా చేస్తే మతం నుంచి బహిష్కరించారు’

Aug 10 2018 3:48 AM | Updated on Aug 10 2018 12:31 PM

yoga Religious boycott - Sakshi

మాచారెడ్డి: యోగా చేసినందుకు తనను మతం నుంచి బహిష్కరించారని కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన షహనాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యోగా డే సందర్భంగా మండల కేంద్రంలోని ఓం శాంతి కేంద్రంలో యోగా చేశానని, పలువురు ముస్లిం యువకులు తనపై దాడి చేసి మతం నుంచి బహిష్కరించారని వాపోయారు. ఆరోగ్యం కోసం యోగా చేయడం తప్పెలా అవుతుం దని ఆమె ప్రశ్నించారు. తన మీద దాడి చేసినప్పుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసి పరువు తీశారన్నారు. తనతో ఎవరు మాట్లాడినా రూ. 5 వేల జరిమానా విధిస్తామని బెదిరించడంతో ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదుకు చందా ఇవ్వడానికి వెళ్తే తీసుకోవడం లేదని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర‍్కొన్న ఆమె..తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement