రెవెన్యూ కార్యాలయంలో మహిళా రైతు హల్‌చల్‌

Women Farmer Demanded For Land Pass Book - Sakshi

భూమికి పట్టా ఇవ్వాలని డిమాండ్‌ 

ద్విచక్రవాహనాలను ధ్వంసం చేసిన వైనం

సాక్షి, ములుగు: ములుగు మండలం పత్తిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపల్లికి చెందిన మహిళా రైతు కాశిరాజు రమ శనివారం ములుగు రెవెన్యూ కార్యాలయ ఆవరణలో హల్‌చల్‌ చేసింది. తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో బంధువులతో కలిసి చేతిలో కర్ర పట్టుకుని రెవెన్యూ అధికారులను ఉద్దేషిస్తూ అసభ్య పదజాలంతో దుర్భషలాడింది. నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నా తనకు చెందిన భూమికి పట్టా ఇవ్వడం లేదని మండిపడింది.

అనంతరం కర్రతో వీఆర్వో తిరుపతితో పాటు ఇతరుల ద్విచక్రవాహనాలను ధ్వంసం చేసింది, గమనించిన రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు రెవెన్యూ కార్యాలయాలనికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆమెను బంధువులు తీసుకెళ్లారు. కాగా, ఈ విషయమై పత్తిపల్లి వీఆర్వో తిరుపతిని వివరణ కోరగా మహిళా రైతు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆమె చెబుతున్న సర్వే నెంబర్‌లో ఆ పేరుతో సెంటుభూమి లేదని, ఆమె తండ్రికి ఎకరం భూమి ఉన్నా అమ్ముకున్నారని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top