కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీలో గురువారం దారుణం చోటుచేసుకుంది.
కొత్తగూడెం(ఖమ్మం జిల్లా) : కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీలో గురువారం దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కూలి పనుల కోసం వెళ్లిన ఓ మహిళపై కొత్తగూడెంకు చెందిన తాపీ మేస్త్రీ ముద్దారపు వెంగలయ్య(38) అత్యాచారం చేశాడు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తాపీ మేస్త్రీని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మహిళకు తీవ్రరక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.