ఓ మహిళను గొంతు కోసి దారుణంగా హతమార్చారు. అయితే ఈ హత్య క్షుద్ర పూజల నేపథ్యంలో జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బషీరాబాద్ (రంగారెడ్డి) : ఓ మహిళను గొంతు కోసి దారుణంగా హతమార్చారు. అయితే ఈ హత్య క్షుద్ర పూజల నేపథ్యంలో జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డి బషీరాబాద్ మండలంలో ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం... మండలంలోని మంతట్టి గ్రామానికి చెందిన నర్సమ్మ(46)ను శనివార అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకొసి చంపేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, హత్య జరిగిన తీరును బట్టి క్షుద్రపూజల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.